డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత

-

డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ లెటర్స్ అందజేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.మిమ్మల్ని అందరినీ చూస్తే.. దసరా పండుగ మూడు రోజుల ముందే వచ్చిందా..? అని గుర్తుకొస్తుంది. ఉద్యోగాలు రావాలంటే.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత ఉద్యోగాలు ఊడాలని ఆనాడే చెప్పాను. నేను చెప్పినట్టే  మీరు వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టారు.. ఇప్పుడు మీకు ఉద్యోగాలు కూడా వచ్చాయి.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కోరి కొరివి దయ్యాన్ని తెచ్చుకున్నామని పేర్కొన్నారు. ప్రపంచానికి గ్లోబల్ సిటిజన్స్ గా మార్చి.. తెలంగాణ పునర్ నిర్మాణంలో ప్రభుత్వ పాఠశాలల పాత్ర చాలా కీలకమైనది. గత ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పట్టించుకునే ప్రయత్నం చేయలేదు. విద్యాశాఖలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. బదిలీలు చేపట్టాం. విద్యాశాఖ అధికారులకు ఆదేశాలిచ్చాం. 21వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చామని తెలిపారు. ఎక్కడ వివాదం లేకుండా ప్రమోషన్లు ఇచ్చాం. 34వేల మంది టీచర్లను బదిలీ చేయడం జరిగిందని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version