గత ముఖ్యమంత్రి నిరుద్యోగులను పట్టించుకోలేదు – సీఎం రేవంత్ రెడ్డి

-

గత ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులను పట్టించుకోలేదని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. కొత్తగా టీచర్ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నగరంలోని ఎల్బి స్టేడియంలో ప్రభుత్వం నియామక పత్రాలను అందజేసింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం 90 రోజులలో 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసి నియామక పత్రాలను అందజేసిందని చెప్పారు.

ప్రత్యేక తెలంగాణ కోసం నిరుద్యోగులు ఆత్మబలి దానాలు చేసుకున్నారని, కానీ గత ముఖ్యమంత్రి వారిని పట్టించుకోలేదని విమర్శించారు. ఉద్యోగాలు రావాలంటే కెసిఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు ఉద్యోగాలు ఊడగొట్టాలని ఆనాడే చెప్పానని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి.

తాము 65 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలను పూర్తి చేశామని అన్నారు. ఉపాధ్యాయులకు నియామక పత్రాలు ఇస్తుంటే ఇంతకంటే ఆనందం మాకు మరొకటి ఉండబోదన్నారు రేవంత్ రెడ్డి. మిమ్మల్ని చూస్తే దసరా పండుగ మూడు రోజుల ముందే వచ్చిందా..? అని అనిపిస్తుందంటూ సంతోషం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version