Cyclone Michaung : తెలంగాణలోని ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

-

Cyclone Michaung : తెలంగాణపై మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో… భారీ వర్ష సూచన ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్ గా మిచౌంగ్ మారింది. దీంతో తెలంగాణ ఈశాన్య జిల్లాలపై తుఫాన్ ప్రభావం ఉంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు అతి నుంచి అత్యంత భారీ వర్ష సూచన ఉన్నట్లు ప్రకటించారు అధికారులు.

hyderabad rains

అలాగే.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్…మహబూబాబాద్, వరంగల్ , హన్మకొండ జిల్లాలకు అరెంజ్ అలెర్ట్‌ జారీ చేశారు. కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట నాగర్ కర్నూల్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, హైదరాబాద్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న తరుణంలో…అవసరం ఉంటేనే బయటకు రావాలని ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఎత్తైన ప్రదేశాలు, చెట్ల కింద ఉండొద్దని హెచ్చరించిన ఐఎండీ…తెలంగాణ రాష్ట్ర, జిల్లాల అధికారులను అలెర్ట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news