హైడ్రా కూల్చివేతలు అడ్డుకున్న పేదలపై క్రిమినల్ కేసు నమోదు అయింది. సున్నం చెరువులో కూల్చివేతలను అడ్డుకున్న ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు….ఈ మేరకు ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారు. ఆదివారం మాదాపూర్ సున్నం చెరువులో అక్రమ కట్టడాల కూల్చివేతకు చేపట్టారు హైడ్రా అధికారులు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లలో నిర్మాణాల కూల్చివేతలు జరిగాయి.
అయితే…ఈ హైడ్రా కూల్చివేతలను స్థానికులు అడ్డుకోవడం జరిగింది. అంతేకాదు…. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు పలువురు బాధితులు. అయితే… విధులకు ఆటంకం కలిగించిన వారిపై మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది హైడ్రా సిబ్బంది. వెంకటేష్, లక్ష్మీ, సురేష్ అనే ముగ్గురిపై కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు…ఈ మేరకు ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారు.