BREAKING : తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ హెల్డ్ బులిటెన్ విడుదల అయింది. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించారు యశోద ఆస్పత్రి వైద్యులు. నిన్న సాయంత్రం నాలుగు గంటలకు పైగా హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసిన యశోద ఆస్పత్రి వైద్యులు…మేజర్ సర్జరీ కావడంతో మరింత పర్యవేక్షణ అవసరం అవుతుందని వివరించారు.
ఐవి ఫ్లూయిడ్స్,యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ తో మెడికేషన్ కొనసాగుతోందని చెప్పారు యశోద ఆస్పత్రి వైద్యులు. వైద్యుల పర్యవేక్షణలో సాధారణ డైట్ ఫాలో అవుతున్నారన్నారు. కొంత కోలుకున్న తర్వాత నడిపించే ప్రయత్నం చేస్తారు… ఫిజియథెరపీ కూడా నిర్వహిస్తారని పేర్కొన్నారు యశోద ఆస్పత్రి వైద్యులు. ఇంకా 5 రోజుల వరకు ఆస్పత్రి లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి వస్తోందని…రికవరీ కి సాధారణంగా ఆరు నుండి ఎనిమిది వారాల వరకు సమయం పడుతుందన్నారు యశోద ఆస్పత్రి వైద్యులు. సీనియర్ సిటిజన్ కావడంతో సాధారణ స్థితిలోకి వచ్చి నడిచేందుకు కనీసం మూడు నెలల సమయం పడుతుంది అంటున్నారు వైద్యులు.