తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే TG-ICET 2025 నోటిఫికేషన్ ఇవాళ విడుదల అయింది. ఈ క్రమంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 10వ తేదీ నుంచి మే 03వ తేదీ వరకు ఆన్ లైన్ లో అప్లికేషన్స్ చేసుకోవచ్చు. అయితే అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.550, బీసీలు,జనరల్ విద్యార్థులు రూ.750 చెల్లించాలి. అనంతరం జూన్ 08, 09 తేదీల్లో ఐసెట్ పరీక్షలను నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ TGCHE.AC.IN ని సందర్శించండి.
రూ.250 అపరాధ విషయంలో మే 17 వరకు, రూ.500 అపరాధ రుసుముతో మే 26 వరకు అవకాశం కల్పించారు. ఆన్ లైన్ లో చేసిన దరఖాస్తుల్లో పొరపాట్లు ఉంటే మే 16 నుంచి20 వరకు వాటిని సరిచేసుకోవచ్చు. ఈ తరుణంలో ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులకు కంప్యూటర్ బెస్ట్ పరీక్ష నిర్వహిస్తారు. 4 షిప్టులలో రాష్ట్ర వ్యాప్తంగా 16 సీబీటీ విధానంలో ఆన్ లైన్ పరీక్ష కేంద్రాల్లో జూన్ 08, 09 తేదీల్లో పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు.