తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు భద్రత తొలగింపు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గన్‌మెన్‌లను తొలగించిన ప్రభుత్వం…ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, 100 ఎకరాల్లో తెలంగాణ హైకోర్టు నిర్మాణం కాబోతుంది. వచ్చే జనవరిలో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, ప్రభుత్వ ముఖ్య అధికారులతో హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సంబంధిత అంశంపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రస్తుత హైకోర్టు భవనం శిథలావస్థకు చేరుకున్న నేపథ్యంలో నూతన భవనాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకతను చీఫ్ జస్టిస్, న్యాయవాదులు ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ పరిధిలో 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని సీఎంను కోరారు.