టీడీపీతో పొత్తు కనీసం 10 ఏళ్లు ఉండాలన్నారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. వైసీపీ పార్టీ పై నిన్న జనసేన అధినేత పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క సీటు కూడా వైసీపీకు వెళ్లకుండా పని చేయాలని కోరారు. ఈ పొత్తు కనీసం ఓ దశాబ్దం కాలం పాటు ఉండాలన్నారు.

దశాబ్ద కాలంపాటు పొత్తు ఉంటేనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన నష్టాన్ని, వైసీపీ పాలన విధ్వంసం నుంచి ఏపీని కాపాడుకోగలమని వెల్లడించారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. నా భవిష్యత్తు కోసం నేనేం చేయడం లేదు.. ఏపీ భవిష్యత్తు కోసమే నేను కృషి చేస్తున్నానని చెప్పారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. ముస్లింలను మైనార్టీ ఓటు బ్యాంకుగా చూడను. మైనార్టీలకు అన్యాయం జరిగితే సాటి మనిషిగా నిలబడతాను. కులం, మతాన్ని దాటి వచ్చాను.. మానవత్వాన్ని నమ్మాను. అన్ని పార్టీలను చూశారు. ఒక్కసారి జనసేనను నమ్మాలని ప్రజలను కోరుతున్నానన్నారు పవన్ కళ్యాణ్.