కమ్మ సామాజిక వర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు కమ్మ వారి సేవా సంఘాల ప్రతినిధులు. కమ్మ సమాఖ్యకు కేటాయించిన 5 ఎకరాల స్థలం వివాదంపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి.
యాదాద్రిలో సత్రం నిర్మించేందుకు కమ్మ సమాఖ్యకు స్థలం కేటాయించేందుకు అంగీకారం తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ సీఎం ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తరపున కేంద్రానికి లేఖ రాస్తానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి… కమ్మ సామాజిక వర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సంచలన ప్రకటన చేశారు.