కాంగ్రెస్ పార్టీలో పులులు, సింహాలు ఉన్నాయి.. జగ్గారెడ్డి మంచి ఆటగాడు : రేవంత్ రెడ్డి

-

కాంగ్రెస్ పార్టీలో పులులు, సింహాలు ఉన్నాయి.. కానీ ఆ పులులను సింహాలను ఆడించే సత్తా ఉన్న నాయకులు జానారెడ్డి అని రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ నల్గొండ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ల్యాండు, సాండు, మాఫియాలు, మర్డర్లు చేసే టిఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పలంటే నల్గొండ బిడ్డలు ముందుండాలని.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ని గెలిపిస్తారనే నమ్మకం నాకుందని వెల్లడించారు.


రైతులను వరి వేయొద్దని కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో 150 ఎకరాల వరి వేసాడని.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో మార్చి నెలలోనే ప్రభుత్వాన్ని హెచ్చరించామని గుర్తు చేశారు. మిల్లర్లకు కోటా కేటాయించలేదు, బస్తాలు కొనలేదు.. అకాల వర్షాలకు తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతు ధర కల్పించి కొనాలని డిమాండ్ చేశారు.

కొనకపోతే మీ అంతు తేల్చేదాక పోరాటం చేస్తాం.. కేంద్రానికి రాష్ట్రానికి రాజకీయ ప్రయోజనమే కావాలి రైతు ప్రయోజనం అవసరంలేదన్నారు. వరంగల్ సభ రైతుల ఆత్మగౌరవం కోసం జరుగుతుందని.. వరంగల్ సభ ద్వారా రైతులకు మేలు జరగాలని వెల్లడించారు. భూ కబ్జాలు చేసే ఎమ్మెల్యే సైదిరెడ్డి.. ఇసుక మాఫియా కు పాల్పడే మంత్రి జగదీశ్ రెడ్డి అని.. జానారెడ్డి లాంటి పెద్దమనుషులు చట్టసభల్లో లేకపోవడం వల్ల సభలకు గౌరవం తగ్గిందని చెప్పారు. ఏ సమస్య వచ్చినా పరిష్కరించే సత్తా ఉన్న నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఉందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version