ఇప్పటిదాకా చిరు తన స్వయం కృషిని నమ్ముకున్నారు. ఇప్పటిదాకా చిరు తనని తాను నమ్ముకుని, దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. దర్శకుడి మాటే అంతిమం అని నమ్ముకున్నారు. దర్శకుడు ఓ సారి ఒన్ మోర్ అని చెప్పాక ఆయన మాటనే వేద వాక్కు అని భావించి నటించే నటులలో ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ చిరునే ! నాటి కోదండ రామి రెడ్డి నుంచి నేటి కొరటాల వరకూ అందరూ ఆయన్ను మెచ్చుకున్నవారే ! సెట్స్ లో నేను మెగాస్టార్ ను కాదండి.. మాముల నటుడ్ని.. నన్ను ప్రేక్షకులు ఈ స్థాయికి తీసుకు వచ్చారు. వాళ్ల అంచనాలు మోయడం కష్టంగా ఉన్నా భరిస్తాను. మోస్తాను. కష్టాన్ని సహిస్తాను.. అని అంటారాయన.
ఇదే మాట తరుచూ అన్నయ్యను ఉద్దేశించి పవన్ కూడా చెబుతుంటారు. అన్నయ్య పడ్డ కష్టం చూసి ఎన్నో సార్లు కన్నీటి పర్యంతం అయిన దాఖలాలు ఉన్నాయి. సందర్భాలు ఉన్నాయి. ఉదంతాలూ ఉన్నాయి. ఆయన కష్టం ఫలించని రోజు కూడా ఉంది. ఆ రోజు కూడా తాను నైరాశ్యం చెందిన మాట వాస్తవమేనని వాటిని దాటుకుంటూ వచ్చాక ఇప్పుడు అనిపిస్తుంది అయ్యో ! ఎందుకలా బాధపడ్డానే అని అనిపిస్తుంది. నా ఒక్కరి కష్టం కాదు కదా ఎందరో కష్టం సినిమా అంటే సమష్టి కృషి ఫలితం…విజయాలూ, వైఫల్యాలు అందరివీ.. అందరికీ కూడా ! అని చెప్పారాయన ఇటీవల ఓ సందర్భంలో .. ఆయన మాట్లాడుతుంటే ఓ మోటివేషన్ స్పీచ్ విన్న విధంగా ఉంటుంది. నేను నా కష్టాన్ని నమ్ముకున్నాను. మీరు మీ కష్టాన్ని నమ్ముకోండి అని చెబుతారాయన. అదే ఆచార్య ఘన విజయానికి ఓ ప్రధాన కారణం. ముఖ్య భూమిక.
ఆట కదా విఘ్నాలు
ఆట కదా విలయాలు
ఆట నీకు..
అవును ! విఘ్నాలు దాటాడు.. విలయాలు దాటాడు.. శివయ్యా ఆల్ ద బెస్ట్ ! ఆచార్య సినిమాను డైరెక్ట్ చేయడం అంటేనే తనకొక భయం.. చిరును డైరెక్ట్ చేయడం అంత సులువు కాదు. వెరీ నెర్వస్. కథ తో పాటు సెటిల్డ్ ఇమోషన్స్, సెటిల్డ్ ఇమేజ్ ఉన్న ఆర్టిస్టుకు అనుగుణంగా ఉండాలి. ఇవే మనసులో ఉంచుకుని ఈ కథ రాశాను అని అంటున్నారు కొరటాల శివ. ఏ కథ అయినా తనను కదిలించాలని, అప్పుడే ఆ చిత్రం విజయవంతం అవుతుందని కూడా అంటున్నారు మరోవైపు చిరు. ఈ ఇద్దరి అపూర్వ కలయికే ఆచార్య. అండ్ ద టైటిల్ ఈజ్ ఆచార్య స్పీక్స్ నౌ.
ధర్మ స్థలిలో కథ..ఆలయ భూముల ఆక్రమణలు, దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరిగే అవినీతి వీటిపై సంధించిన శివాస్త్రం ఆచార్య. ఈ సినిమాలో చరణ్ పాత్ర క్రమక్రమంగా ఎదుగుతూ వస్తుంది. చిరు పాత్ర కన్నా చాలా బాగుంటుంది. మొదట్నుంచి నా నమ్మకం ఇదేనండి. నా కన్నా నా బిడ్డ బాగా నటిస్తే ఆనందం కాక అసూయ ఉంటుందా చెప్పండి అని పదే పదే చెప్పారు చిరు. పులకించిపోయారు చిరు.ఆ..విశేషాల సమాహారామే.. అభిమానాల సందేహాలకు సమాధానమే ఆచార్య.