వైసీపీ నేతలకు తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏపీపై కేటీఆర్ ఉన్న మాటే అన్నారని.. నిజమే అక్కడ రోడ్లు అద్వానంగా ఉన్నాయని చురకలు అంటించారు. ఎపి నాయకులకు అంత అక్కసు ఎందుకు ? అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో జనరేటర్లు పెట్టుకునే పరిస్థితి ఏమి లేదని.. హైదరాబాద్ లో ఉండే ఎపి నాయకుల విజ్ఞతకే వదిలి వేస్తున్నామని తేల్చి చెప్పారు.
విజయవాడ, అమరావతి నుంచి బిల్డర్లు హైదరాబాద్ వస్తున్నారు …దానికి మేము ఏమి చేస్తామని వెల్లడించారు ప్రశాంత్ రెడ్డి. TRS ఎంపీ రంజిత్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లో రెండు రోజులు కరెంట్ పోయే పరిస్థితి ఉందా ? అని నిలదీశారు. కరెంట్ బిల్లు కట్టకపోయి ఉంటే బొత్స ఇంటికి కరెంట్ కట్ చేసి ఉండవచ్చన్నారు. హైదరాబాద్ లో ఇప్పడు ఇన్వర్ట్ లు ఉన్నాయా ? అని నిలదీశారు. వైసీపీ ఎంపీలు మేము కేసీఆర్ ఫ్యాన్స్ అని నాకు చాలా మంది చెప్పారని.. 28 రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలను వాళ్ళు కాపీ చేస్తున్నారని మండిపడ్డారు.