కామారెడ్డి నుంచి రేవంత్ సోదరున్ని తరిమిన బీఆర్‌ఎస్‌ !

-

Revanth : కామారెడ్డి నుంచి కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి సోదరుడు బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు తరిమేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి కామారెడ్డిలో తిరుగుతున్నాడు రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి. ఎన్నికల రోజు స్థానికేతరులు ఉండాకూడదు అన్న నిబంధన ఉల్లంఘించి మూడు కార్ల కాన్వాయ్ లో కామారెడ్డిలో తిరుగుతున్నాడు రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి.

Revanth brother in kamareddy

ఇండిపెండెంట్ అభ్యర్ధికి పోలింగ్ ఏజెంట్‌గా తప్పుడు పత్రాలు సృష్టించి కామారెడ్డిలోనే ఉన్న కొండల్ రెడ్డి….మూడు కార్ల కాన్వాయ్‌లో యధేచ్చగా కామారెడ్డిలో తిరుగుతున్నాడు. ఇది గమనించి నిలదీసిన స్థానిక బీఆరెస్ నాయకులు… నాన్ లోకల్ మనిషివి నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావని వాగ్వివాదానికి దిగారు. తప్పైపోయింది సారీ అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు కొండల్ రెడ్డి. ఇక ఆయన కార్లు సోదా చేసి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version