రేవంత్‌ సంచలనం…3వ తరగతి వరకు అంగన్ వాడీ కేంద్రాలలోనే విద్యాబోధన ?

-

రేవంత్‌ సంచలనం…3వ తరగతి వరకు అంగన్ వాడీ కేంద్రాలలోనే విద్యాబోధన ఉండేలా ప్రణాళికలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పటిష్టతకు సరికొత్త విధానంతో ముందుకెళ్లనుందట రేవంత్‌ ప్రభుత్వం. వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్టం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖ కారదర్శి బుర్రా వెంకటేశంకు సూచించిన సీఎం రేవంత్‌… ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ తో సమాంతరంగా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కొనసాగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారట.

revanth on schools

ప్లే స్కూల్ తరహాలో 3వ తరగతి వరకు అంగన్ వాడీ కేంద్రాలలోనే విద్యాబోధన చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్న సీఎం….సొంత గ్రామాల్లోనే విద్యార్థులు చదువుకునేలా వీలు కల్పించాలని సూచనలు చేశారట. అంగన్ వాడీలలో విద్యాబోధనకు అదనంగా ఒక టీచర్ నియమించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించిన సీఎం… 4వతరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారట. గ్రామాల నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కు వెళ్లేందుకు ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించేలా చూడాలని సూచించిన సీఎం రేవంత్‌… విద్యా వేత్తల అభిప్రాయాలు తీసుకున్నాక ఒకట్రెండు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టేలా ప్రాణాళికలుండాలని వివరించారట. ప్రభుత్వ నిధులతోపాటు సీఎస్ఆర్ ఫండ్స్ తో విద్యార్థులకు అన్ని వసతులు ఉండేలా చర్యలు చేపట్టాలన్న సీఎం…. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version