డీజీపీకి రేవంత్ రెడ్డి ఫోన్.. పోలీసులు వాహనాలను అడ్డుకోవడంపై ఆగ్రహం..

-

ఖమ్మం జిల్లాలో ఇవాళ కాంగ్రెస్ జనగర్జన భారీ బహిరంగ సభ జరగనుంది. అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరవనున్న ఈ సభలో రాహుల్ సమక్షంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హస్తం పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మంలో నిర్వహిస్తున్న జన గర్జన సభకు ప్రజలు రాకుండా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుందని ఆరోపించారు.

ఇప్పటికే 1700 వాహనాలకు పైగా సీజ్ చేశారు అంటూ కంటతడి పెట్టారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అయితే.. ఈ తరుణంలోనే.. తెలంగాణ డీజీపీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. పోలీసులు వాహనాలను అడ్డుకోవడంపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వాహనాల్ని అడ్డుకోవడం సరికాదన్న రేవంత్.. పరిస్థితి చెయ్యి దాటితే బాధ్యత మీరే తీసుకోవాలన్నారు. కాగా, ఖమ్మం ఇంట్రెన్స్ లో వాహనాలను rta అధికారులు అవుతున్నారు. వెయ్యి ఫైన్ వేసి వదిలేస్తా అనుకోకండి..ఒక్కో వెహికల్ కి లక్ష ఫైన్ వేస్తా అని అధికారులు బెదిరిస్తున్నారు అని కాంగ్రెస్ నేతల ఆరోపణలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news