మణిపూర్‌ అల్లర్లలో విదేశీ హస్తం ఉండొచ్చు : CM బిరేన్ సింగ్

-

మణిపూర్‌ అల్లర్లలోపై CM బిరేన్ సింగ్ సంచలన ప్రకటన చేశారు. మణిపూర్ అల్లర్లలో విదేశీ హస్తం ఉందని ఆ మణిపూర్ రాష్ట్ర CM బిరేన్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. ‘మణిపూర్ పక్కనే మయన్మార్ ఉంది. చైనా కూడా 398 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ బార్డర్ లో పెద్దగా భద్రత ఉండదు.

ప్రస్తుత హింసలో ఏ విషయాన్ని ఈజీగా కొట్టి పారేయలేం. ఇదంతా పక్కా ప్లాన్ తో అమలు చేసినట్లు అర్థం అవుతోంది’ అని అన్నారు. కాగా, అల్లర్లలో చైనా హస్తం ఉందని, సీఎం బిరేన్ సింగ్ రాజీనామా చేయాలని ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు.

కాగా, మణిపూర్ హింసలో చైనా హస్తం ఉందని మహారాష్ట్ర ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. ‘మణిపూర్ ఆందోళనల్లో చైనా హస్తం ఉంది. చైనాకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? మణిపూర్ సీఎం రాజీనామా చేయాలి. అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలి. ప్రధాని మోదీ అమెరికా వెళ్తారు కానీ మణిపూర్ ఎందుకు వెళ్లట్లేదు?’ అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news