కోమటిరెడ్డిని RG పాల్ అని పిలవాలి – రేవంత్ ఆదేశాలు

-

తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కాంగ్రెస్ అనుబంధ సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నీ rg పాల్ అని పిలవాలని ఆదేశాలు జారీ చేశారు రేవంత్‌ రెడ్డి. అట్లా కాదని ఎవరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డీ అని పిలిచినా షోకాజ్ నోటీసులు ఇస్తానని వార్నింగ్‌ ఇచ్చారు రేవంత్‌ రెడ్డి.

సభలు… సమావేశాల్లో కూడా ఆర్జీ పాల్ అనే పిలవాలి అని ఆదేశించారు. ఏపీ లో ka పాల్… తెలంగాణ లో అర్జీ పాల్ అంటూ సమావేశంలో రేవంత్‌ రెడ్డి చురకలు అంటించారు. కాంగ్రెస్‌ ను ఖతం చేసేందుకు కుట్ర జరుగుతోందని నిప్పులు చెరిగారు. రాజగోపాల్ రెడ్డి కి మాట్లాడే అవకాశం వచ్చిందంటే కాంగ్రెస్ వల్లేనని… బీజేపీ టీఆరెస్ లు కుమ్మక్కు రాజకీయాలు అని ఆగ్రహించారు.రాజగోపాల్ రెడ్డి 5 నిమిషాల్లో రాజీనామా ఆమోదం దానికే సంకేతమని నిప్పులు చెరిగారు. ఎవరికి టికెట్ ఇచ్చిన అందరం కలిసి పని చేయాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version