కాకినాడలో కన్నబాబుకు కల్యాణ్ చెక్?

-

నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీతో గాని పవన్ కల్యాణ్ కలిస్తే…చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు డేంజర్ లో పడినట్లే అని చెప్పొచ్చు. ఇందులో ఏ మాత్రం డౌట్ లేదు…టీడీపీ-జనసేన పొత్తు ఉంటే వైసీపీ ఎమ్మెల్యేలకు రిస్క్ ఎక్కువ ఉంటుంది..ముఖ్యంగా కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలకు ఇబ్బంది. గత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి…వైసీపీకి బెనిఫిట్ జరిగింది..అలాగే టీడీపీకి డ్యామేజ్ జరిగింది. కేవలం జనసేన ఓట్లు చీల్చడం వల్ల పలువురు వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు.

అలా ఓట్లు చీలడం వల్లే గెలిచిన వారిలో కన్నబాబు కూడా ఒకరు. ఈయన ప్రజారాజ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో కూడా టీడీపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య ఓట్లు చీలిపోవడం వల్ల…ప్రజారాజ్యం నుంచి కన్నబాబు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2014లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి బాగానే ఓట్లు తెచ్చుకుని మూడో స్థానానికి పరిమితమయ్యారు. 2019 ఎన్నికలోచ్చేసరికి కన్నబాబు…టీడీపీపై దాదాపు 8 వేల పైచిలుకు ఓట్లతో గెలిచారు.

గత ఎన్నికల్లో జగన్ గాలిలో ఈ మెజారిటీ అనేది చాలా తక్కువ. కానీ ఈ ఓట్లు అయితే గెలవడానికి కారణం జనసేన ఓట్లు చీల్చడం. ఆ ఎన్నికల్లో కన్నబాబుకు దాదాపు 74 వేల ఓట్లు పడితే…టీడీపీకి 65 వేల ఓట్లు పైనే పడ్డాయి. ఇక ఇక్కడ జనసేనకు 40 వేల ఓట్లు పడ్డాయి. అంటే ఏ స్థాయిలో జనసేన ఓట్లు చీల్చిందో అర్ధం చేసుకోవచ్చు. అదే టీడీపీ-జనసేన గాని అప్పుడే కలిసి పోటీ చేసి ఉంటే కన్నబాబు పరిస్తితి ఏమయ్యేదో ఊహించుకోవచ్చు..అలాగే ఆయనకు మంత్రి పదవి కూడా దక్కేది కాదు.

జనసేన ఓట్లు చీలడం వల్ల ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే కొంతకాలం మంత్రిగా కూడా పనిచేశారు. ఇక నెక్స్ట్ కూడా రెండు పార్టీలు విడిగా పోటీ చేస్తే కన్నబాబుకు ప్లస్. అలా కాకుండా పవన్…టీడీపీతో కలిస్తే కన్నబాబుకు చెక్ పడుతుంది…పైగా పొత్తు ఉంటే ఈ సీటు జనసేనకు దక్కొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version