ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమే బాగుపడింది : రేవంత్ రెడ్డి

-

నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రంలో కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చి పదేళఅలు అయినా.. రాష్ట్రం లో రైతుల ఆత్మహత్యలు ఆగకపోగా.. నిరుద్యోగం తగ్గకపోగా.. ఈ రెండింటిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. 25 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములను కాంగ్రెస్‌ పంపిణీ చేసిందన్న రేవంత్.. కేసీఆర్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీ.. చేసిన అభివృద్ధిని చెప్పకుండా కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి ఈరోజు నర్సాపూర్లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొని ప్రసంగించారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం. మహలక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తాం. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అందజేస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. రైతుబంధు పథకం ద్వారా రైతులకు ఎకరాకు రూ.15 వేలు ఇస్తాం. ఇళ్లు నిర్మించుకునే పేదలకు రూ.5 లక్షల ఆర్థికసాయం చేస్తాం. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే నెలకు రూ.4 వేల పింఛను ఇస్తాం. వివాహ సమయంలో మహిళకు తులం బంగారం ఇస్తాం. అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news