ఎన్నారై అంటే నాన్ రిలయబుల్ ఇండియన్ – సీఎం రేవంత్ రెడ్డి

-

ఎన్నారై అంటే నాన్ రిలయబుల్ ఇండియన్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి టంగ్‌ స్లిప్‌ అయ్యారు. ఇవాళ అసెంబ్లీలో కేటీఆర్‌ కు కౌంటర్‌ ఇస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు రాజకీయంగా అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ.. ఎంపీగా, కేంద్రమంత్రిగా కేసీఆర్ కు కాంగ్రెస్ ఛాన్స్ ఇచ్చిందన్నారు. పోతిరెడ్డిపాడు గురించి.. పీజేఆర్ ఒక్కరే పోరాటం చేశారని వెల్లడించారు.

revanth reddy couter to ktr

ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్లు ఎవరూ కొట్లాడలేదు.. ఐదేళ్ల సమయం ఉందని వివరించారు. ఏమేమి జరిగిందో.. అన్నీ లెక్కలతో సహా వివరిస్తాం.. 9 ఏళ్ల పాలనపై ఎక్స్ రే తీసినట్లు అన్నీ బయటపెడతామని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో జరిగిన చరిత్ర పై చర్చ చేద్దామని వెల్లడించారు. గత చరిత్ర లో.. మీ వైపు ఉన్న వాళ్ళ చరిత్ర తీద్దామని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version