రాజన్న సిరిసిల్ల జిల్లాలో బతుకమ్మ చీరల ఆర్డర్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అంబేద్కర్ చౌరస్తాలో బిఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు.రేవంత్ రెడ్డి ఫోటోతో కూడిన దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. నిన్న శాసనసభ లో బి.ఆర్.ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దిష్టిబొమ్మ దగ్ధం చేసే క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు స్వల్ప తోపులాట జరిగింది. దీంతో ఎట్టకేలకు రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు టిఆర్ఎస్ నాయకులు.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు ఖండిస్తూ అంబేద్కర్ చౌరస్తా లో బి.ఆర్.ఎస్ శ్రేణులు నిరసన, దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు టిఆర్ఎస్ నాయకులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని దహనం చేశారు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీ సభలో క్షమాపణలు చెప్పకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు మహిళ నాయకురాలు. నేత కార్మికులను ఆదుకొని, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్ వెంటనే ఇవ్వాలని ఆందోళనకు దిగారు.