కేసీఆర్‌ కప్పం కట్టడం వల్లే మేడిగడ్డ బ్యారేజీపై కఠిన చర్యల్లేవ్‌: రేవంత్‌రెడ్డి

-

కమీషన్లకు కక్కుర్తి పడి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతను పట్టించుకోలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. సాంకేతిక కారణాల వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని ఆరోపించారు. నిర్మాణానికి అనుమతి ఇచ్చిన అధికారుల్ని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్‌ కప్పం కడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ కప్పం కట్టడం వల్లే మేడిగడ్డ బ్యారేజీపై కఠిన చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ-బీఆర్ఎస్-మజ్లిస్‌ కలిసి పనిచేయబోతున్నాయని రేవంత్‌ రెడ్డి అన్నారు. పూర్తి ఆధిక్యంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర సంపదను పార్టీ ప్రయోజనాలకు వాడుతోందని ఆరోపించారు. రైతు బంధు, దళిత బంధు ఇస్తామని బీఆర్ఎస్ గోబెల్స్‌ ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తున్న అధికారులను బదిలీ చేసి.. నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను నియమించాలని ఈసీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news