పంచాయతీ ఎన్నికలపై బిగ్ అప్డేట్….ఎంత మంది పిల్లలు ఉన్నా పోటీ చేయచ్చు !

-

Telangana Panchayat Elections:  పంచాయతీ ఎన్నికలపై బిగ్ అప్డేట్ వచ్చింది. . పంచాయతీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇద్దరు కన్న ఎక్కువ మంది పిల్లలు ఉన్న అభ్యర్థులు లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయకుండా రూల్ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ రూల్ ను రద్దు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
CM Revanth Reddy
పంచాయతీరాజ్ చట్టం-2018 సెక్షన్ 21(3)ని తొలగించే ప్రతిపాదనను క్యాబినెట్ ముందు ఉంచినట్లుగా చర్చలు మొదలయ్యాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే ఈ మార్పు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలా ఉండగా… ఆదివాసి పిల్లలకు ఈ విద్యా సంవత్సరం నుంచి ఉచితంగా విద్యను అందించబోతున్నామని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బిసి గంట చక్రపాణి తెలియజేశాడు. ఆదివాసిలకు చదువును నేర్పించాలని ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఉచితంగా విద్యను అందిస్తామని స్పష్టం చేశారు. దీంతో ఆదివాసి విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news