తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇండ్లపై.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే లబ్ధిదారులకు తక్కువ ధరకు సిమెంటు అలాగే స్టీల్ సరఫరా చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మార్కెట్ రేటు కంటే ఎంత తక్కువగా సరఫరా చేస్తారో చెప్పాలని…. ఇప్పటికే సిమెంట్ కంపెనీలతో అధికారులు సమావేశం నిర్వహించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం 320 రూపాయలు సిమెంట్ బస్తా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సిమెంట్ బాస్ తో 260 రూపాయలకు ఇచ్చిన ప్లాన్ చేస్తున్నారట.
ఇక 55000 ఉన్న టన్ను స్టీలు…. 47 వేలకు సరఫరా చేయాలని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇద్దరమ్మా ఇల్లు పూర్తి కావాలంటే… ఒక్కో ఇంటికి 180 సిమెంట్ బస్తాలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో 1500 కిలోల స్టీలు అవసరమని చెబుతున్నారు అధికారులు.