తెలంగాణ రైతులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైతు భరోసా పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త కిటుకు పెట్టింది. రైతు భరోసా కోసం ఆన్లైన్ లో అప్లికేషన్లు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసిందట రేవంత్ రెడ్డి. ఈ పథకంలో లబ్ధిదారులకు న్యాయం జరిగేందుకు మళ్లీ అప్లికేషన్ స్వీకరించే యువతలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
దీని కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ లేదా యాప్… తీసుకురావాలని ప్రణాళికలు చేస్తోందట. అంతేకాదు సాగు చేసిన వారికి మాత్రమే… రైతు భరోసా ఇవ్వాలని డిసైడ్ అయిందట. అందుకే మళ్ళీ అప్లికేషన్లు తీసుకొని… అసలు సిసలు సాగు రైతులకు మాత్రమే… రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని సమాచారం. ఇక అసలు రైతులను గుర్తించేందుకు సాటిలైట్, ఫీల్డ్ సర్వే కూడా నిర్వహించబోతుందట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఎన్ని ఎకరాల లోపు ఇవ్వాలనే విషయంపై భట్టి విక్రమార్క అధ్యక్షతన సబ్ కమిటీ… సీఎం రేవంత్ రెడ్డి తో చర్చించి తుది నిర్ణయం తీసుకోబోతున్న వార్తలు వస్తున్నాయి.