కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ తో రేవంత్ రెడ్డి భేటీ !

-

హైదరాబాద్ జలసౌధలో కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ పరమేశంతో మల్కాజ్ గిరి ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జీవో 69 ద్వారా మంజూరు చేసిన నారాయణపేట- కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి ఆయనకు ఎంపీ కొన్ని వివరాలు అందించారు. ఈ ప్రాజెక్టుకు నికర జలాలను కేటాయిస్తూ జారీ చేసిన జీవో 69 కాపీని చైర్మన్ కు రేవంత్ రెడ్డి అందచేసారు.

revanth-reddy

ఈ ప్రాజెక్టుకు 2014లోనే అనుమతులు లభించాయని ఇందుకు రూ. 1450 కోట్లు నిధులు కేటాయింపు కూడా జరిగిందని చైర్మన్ దృష్టికి తెచ్చారు రేవంత్. భూ సేకరణ సర్వే తదితర అవసరాల కోసం మొదటి దశలో రూ. 133 కోట్లు నిధులు కూడా మంజూరు చేసిన విషయాన్ని కూడా చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు ఊసే ఎత్త లేదని రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తక్షణమే ఈ ప్రాజెక్టును చేపట్టేట్లు చూడాలని, ఈ నెల 25వ తేదీన జరగనున్న అపెక్స్ కమిటీ అజెండాలో చేర్చాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version