రైతు బంధు భూమి యజమాని లేదా కౌలు రైతు ఎవరో ఒకరికే ఇస్తామని ప్రకటించారు రేవంత్ రెడ్డి. రైతు బంధు అనేది భూమి యజమానికి ఇస్తే కౌలు రైతుకు రాదు.. కౌలు రైతుకు ఇస్తే భూమి యజమానికి రాదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రైతుబంధు పేరిట ప్రభుత్వ నిధులతో బీఆర్ఎస్ ఓట్లు కొనుగోలు చేస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
‘ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 15లోపే రైతుబంధు ఇవ్వాలని మేము చెప్పాం. కానీ కావాలనే ఓటు వేసే ముందే డబ్బులు వేస్తున్నారు. దీనికి బీజెపీ సహకారం కూడా ఉంది. రైతుబంధు ఇస్తున్న కేసీఆర్…. దళిత బంధు, బీసీబంధు, మైనార్టీబంధు ఎందుకు ఇవ్వట్లేదు?’ అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.