బండి సంజయ్, రాజాసింగ్‌ను ఓడించి చూపిస్తాం : కేటీఆర్

-

బిజెపి నేతలు రాజాసింగ్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లను ఓడించి చూపిస్తామని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. “కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధును వ్యతిరేకిస్తున్న రేవంత్…. మోడీ పీఎం కిసాన్ ను ఎందుకు వ్యతిరేకించట్లేదు. కాంగ్రెస్ నేతల మాటలు బోగస్. ఆ పార్టీని నమ్మే స్థితిలో ప్రజలు లేరు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ హవా నడుస్తోంది.

మరోసారి మా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం” అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజలు రిస్క్ తీసుకోవడానికి ఆసక్తిగా లేరని.. తొమ్మిదన్నరేళ్ల అభివృద్ధిని చూసి మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని.. బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి రావాలని భావిస్తున్నారని కేటీఆర్ పునరుద్ఘాటించారు.

కరెంటు కోతలు, స్కాముల కోసమా? లేక ఎండే చెరు వులు, నెర్రెలు బారే నేలల కోసమా అని అడిగారు. గుజరాత్‌లో అయిదుసార్లు బీజేపీ.. దేశంలో 11 సార్లు కాంగ్రెస్‌ అధికారంలో ఉండొచ్చా? అని అన్న కేటీఆర్.. తెలంగాణలో మాత్రం రెండుసార్లకే మార్పు కావాలా? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version