విధులకు హాజరుకాని రేవంత్‌రెడ్డి భద్రతా సిబ్బంది.. అదే కారణమా..?

-

టీపీసీసీ చీఫ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డికి భద్రతా సిబ్బంది షాక్ ఇచ్చారు. ఆయనకు భద్రతగా ఉన్న నలుగురు గన్‌మెన్లు బుధవారం రాత్రి నుంచి విధులకు రావడం లేదు. రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 4 ప్లస్‌ 4 గన్‌మెన్లు ఉండగా.. ఎంపీ అయిన తర్వాత ఆ సంఖ్యను 2 ప్లస్‌ 2కి కుదించారు. ఇటీవల ఆయన పాదయాత్ర చేసిన సమయంలో భద్రత కల్పించాలంటూ హైకోర్టులో వ్యాజ్యం వేయగా… 69తో భద్రత కల్పించినట్టు రేవంత్‌ వర్గీయులు తెలిపారు. యాత్ర తరువాత తిరిగి 2 ప్లస్‌ 2 గన్‌మెన్లు మాత్రమే విధులు నిర్వహిస్తూ వచ్చారు.

అయితే, రెండ్రోజుల కింద రేవంత్‌రెడ్డి పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పోలీసు సంఘం ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ..  వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  ఈ నేపథ్యంలో ఆయన వద్ద విధులు నిర్వర్తిస్తున్న 2 ప్లస్‌ 2 గన్‌మెన్‌లు ఉన్నపళంగా బుధవారం రాత్రి నుంచి విధులకు రావడం ఆపేశారు. తనకు భద్రత తొలిగించినట్లు ఏలాంటి అధికారిక సమాచారం లేదని రేవంత్‌ రెడ్డి అనగా..  డీజీపీ అంజనీ కుమార్‌ మాత్రం తామేమీ రేవంత్‌ రెడ్డికి భద్రత తొలిగించలేదని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version