తెలంగాణకు మోదీ పెద్దన్నలాగా ఉన్నారు : సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణకు మోదీ పెద్దన్నలాగా ఉన్నారు అని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి. మోడీ ఆశీస్సులు ఉంటే గుజరాత్ లాగా తెలంగాణ అభివృద్ధి చేస్తామని ప్రకటించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నరేంద్ర మోడీ నా బడే భాయ్ అన్న రేవంత్ రెడ్డి… బడే భాయ్ మోడీ ఆశీస్సులు ఉంటే గుజరాత్ లాగా తెలంగాణ అభివృద్ధి చేస్తామన్నారు. ఆదిలాబాద్‌ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ.. రూ.6,697 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

revanth-reddy possitive comments on pm-modi

ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ ఉంటే ప్రజలకే నష్టమని చెప్పారు. ఘర్షణాత్మక వైఖరితో ఉంటే అభివృద్ధి వెనకబడుతుందని వివరించారు. మా వైపు నుంచి ఎలాంటి భేషజాలు ఉండవు.. ప్రధాన మంత్రి అంటే మాకు పెద్దన్నలాంటివారని కొనియాడారు. గుజరాత్‌లా తెలంగాణ అభివృద్ధి చెందేందుకు మీ సహకారం కావాలని కోరారు సీఎం రేవంత్‌రెడ్డి. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి తెలంగాణకు వచ్చిన ప్రధానికి స్వాగతం అన్నారు రేవంత్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version