నూతన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి revanth reddy బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఖరారు అయింది. రేవంత్ రెడ్డి జూలై 7న బాధ్యతలు స్వీకరిస్తారని తెలంగాణ కాంగ్రెస్ ఓ ప్రకటనలో తెలిపింది. రేవంత్ రెడ్డి జూలై 7న ఉదయం 10 గంటలకు పెద్దమ్మ తల్లిని దర్శించుకోనున్నారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సుల అనంతరం ప్రజాభివందనం చేస్తూ, నాంపల్లి దర్గ మీదుగా గాంధీ భవన్ చేరుకుంటారు. మధ్యాహ్నం 12 నుంచి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉంటుందని తెలంగాణ కాంగ్రెస్ వెల్లడించింది. రేవంత్ రెడ్డితో పాటు ఆయనతో ఎన్నికైన నూతన కార్యవర్గం కూడా అదే రోజు బాధ్యతలను స్వీకరించనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎవరు హాజరవుతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
కాగా జూన్ 26వ తేదీన రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా నియమిస్తూ ఏఐసీసీ ప్రకటన విడుదల చేసిన విషయం తెల్సిందే. రేవంత్ రెడ్డితో పాటు ఐదుగురిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా, పది మందిని సీనియర్ వైస్ ప్రెసిడెంట్లుగా నియమించింది. కాగా అందుకే టీపీసీసీ చీఫ్ గా నియామకమైన అనంతరం రేవంత్ రెడ్డి పార్టీలోని సీనియర్ నేతలను కలుస్తూ వస్తున్న విషయం తెల్సిందే. జానారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల, వీహెచ్ వంటి సీనియర్ నేతలతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.