రేవంత్ రెడ్డిని కూడా అరెస్టు చేస్తారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఓటుకు నోటు కేసును ఉద్దేశించి..ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని కూడా అరెస్టు చేస్తారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వెల్లడించారు.
లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైలు నుంచి విడుదలైన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆసక్తికర అంశానికి తెరలేపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్, పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ వంటి వాళ్లను కేంద్రం అరెస్టు చేయిస్తుందని ఆరోపించారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్. వారందరితో సీఎం పదవులకు రాజీనామా చేయించేందుకు బీజేపీ సిద్ధమవుతోందన్నారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్.