కేసీఆర్ పేరు తుడిచేసే అంత గొప్ప పరిపాలన రేవంత్ రెడ్డిది కాదు.. రేవంత్ రెడ్డినే దుర్మార్గుడిగా చరిత్ర చిత్రీకరిస్తుందని కాంగ్రెస్ కార్యకర్త, అడ్వొకేట్ శరత్ పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరు అవునన్నా కాదన్నా రైతులకు ముడి సరుకులు ఇచ్చి, పెట్టుబడి సాయం ఇచ్చి, వ్యవసాయాన్ని గణనీయంగా అభివృద్ధి చెందడంలో కేసీఆర్ చేసిన కృషి ఎవరు కాదనలేరు. లగచర్ల ఘటనకు బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు.. రేవంత్ రెడ్డి ఆడే అబద్ధాలకు అవార్డు ఇవ్వాలి.
ఖచ్చితంగా సీఎం పదవి నుంచి రేవంత్ రెడ్డి మారుస్తారు.. మార్చకుంటే కాంగ్రెస్ సర్వనాశనం అవుతుంది. రేవంత్ రెడ్డి పిరికివాడు.. ప్రజల దగ్గరకి పోయే అంతే ధైరసాహసాలు ఆయనకి లేవు, ఆయన పాలన మీద ఆయనకే నమ్మకం లేదు. తెలంగాణ బీజేపీ పార్టీ లేదు.. కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డికి బంధువు.. బీజేపీ రేవంత్ రెడ్డి కాలుకు చెప్పులాగా కూర్చుంది అని తెలిపారు.