ఏంటో కాంగ్రెస్‌లో ఒక చిన్న పని జరగాలన్న పెద్ద రచ్చ జరిగేలా ఉంది..అసలు ఏ విషయమైన చిరిగి చాట అయ్యేవరకు కాంగ్రెస్ నేతలు వదలరు. ప్రత్యర్ధులపై పోరాడాల్సిన సమయంలో ఒకరిపై ఒకరు పోరాటం చేసుకుంటూ ఉంటున్నారు…కొన్నేళ్లుగా తెలంగాణ కాంగ్రెస్‌లో ఇదే తంతు నడుస్తోంది..ముఖ్యంగా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి ఏదొక రచ్చ నడుస్తూనే ఉంది..రేవంత్ ఒక పనిచేస్తే దాన్ని వ్యతిరేకించే వారు ఎక్కువగా ఉంటున్నారు. అలాగే రేవంత్ సైతం మిగిలిన నేతలని పట్టించుకోకుండానే తన పని తనది అన్నట్లు వెళ్లిపోతున్నారు. దీంతో పెద్ద రచ్చ నడుస్తోంది.
తాజాగా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలని ఆలోచిస్తున్నారు…గతంలో వైఎస్సార్ పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఊపు తీసుకొచ్చారో..అలాగే ఇప్పుడు కూడా రేవంత్ చేయాలని అనుకుంటున్నారు…కానీ రేవంత్..వైఎస్సార్ కాదుగా అందుకే రేవంత్ యాత్రకు కాంగ్రెస్ సీనియర్లు బ్రేకులు వేస్తున్నారు…ఒకవేళ రేవంత్ పాదయాత్ర చేస్తే క్రెడిట్ మొత్తం తనకే దక్కుతుందని, పైగా అధికారంలోకి వస్తే రేవంత్‌కే సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయని, కాబట్టి రేవంత్‌కు ఆ ఛాన్స్ ఇవ్వకూడదని కొందరు సీనియర్లు భావిస్తున్నారు.
అదే సమయంలో రేవంత్‌తో పార్టీలో ఉన్న పెద్ద నేతలకు కూడా పాదయాత్రలో భాగస్వామ్యం ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తోంది…లేదంటే ఎవరి నియోజకవర్గంలో వారు పాదయాత్ర చేసుకుంటే బెటర్ అంటున్నారు..ఇప్పటికే భట్టి విక్రమార్క..తన నియోజకవర్గం మధిరలో యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.
అలాగే ఎవరి నియోజకవర్గంలో వారు పాదయాత్ర చేస్తే అదే మేలు అని చెబుతున్నారు…కానీ ఇలా చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి ఊపు రాదనే వాదన రేవంత్ వర్గం చేస్తుంది…రేవంత్ లాంటి ఫాలోయింగ్ నాయకుడు రాష్ట్రమంతా యాత్ర చేస్తేనే కాంగ్రెస్‌కు ప్లస్ అంటున్నారు…కానీ దీనికి సీనియర్లు ఒప్పుకోవడం లేదు…సీనియర్లు ఒప్పుకోకపోయినా అధిష్టానాన్ని ఒప్పించి ముందుకెళ్లాలని రేవంత్ చూస్తున్నారు. మరి చూడాలి చివరికి రేవంత్ పాదయాత్ర జరుగుతుందో లేదో.