ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టేందుకు రేవంత్‌ నిర్ణయం !

-

బడ్జెట్ పై తెలంగాణ సీఎం రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.

Revanth’s decision to budget Otan account

లోక్ సభ ఎన్నికల ముందు కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతుండగా…. తెలంగాణ రాష్ట్రం కూడా అలాగే ముందుకెళ్లాలని భావిస్తోంది. ఓటాన్ బడ్జెట్ లో రాష్ట్రాలకు కేంద్రం కేటాయించే నిధులపై క్లారిటీ ఉండదు. కాబట్టి కేంద్రం ఫుల్ బడ్జెట్ ను చూశాక రాష్ట్ర బడ్జెట్ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

కాగా, కొత్త రేషన్ కార్డుల అంశంపై రానున్న కేబినెట్ బేటిలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కొత్త కార్డులకు మీసేవ ద్వారా దరఖాస్తులు స్వీకరించడం, ఇదివరకే ఉన్న కార్డులో కుటుంబసభ్యుల్ని చేర్చే విషయంపై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది.రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన కార్యక్రమంలో భారీగా విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో వీలైనంత త్వరగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news