మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ రాశారు. గ్రేటర్ హైదరాబాద్ లో వర్షాలతో ఉత్పన్నమైన పరిస్థితులు, సహయ చర్యల గురించి…మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ రాశారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరం విలవిలలాడుతోంది. గల్లీ ఏరైంది.. కాలనీ చెరువైంది.. రహదారి సాగరమైంది. రోడ్లన్నీ చెరువులుగా మారిపోయాయి. బస్తీలు, కాలనీలు జలమయమయ్యాయి.
రోడ్లపై మోకాలి లోతున నీళ్లు నిలిచాయి. లోతట్టు ప్రాంతాల పరిస్థితి మరీ దయనీయంగా తయారైందని లేఖలో పేర్కొన్నారు. ఇటువంటి నేపథ్యంలో బాధ్యతయుతమైన పదవిలో ఉన్న మీరు ప్రజలను గోసను పట్టించుకోకుండా పత్తా లేకుండా పోయారని ఆగ్రహించారు. హైదరాబాద్ డల్లాస్, ఓల్డ్ సిటీ ఇస్తాంబుల్ చేస్తామని ప్రగల్బాలు పలికిన తండ్రి కొడుకులు హైదరాబాద్ నగరాన్ని నరక కూపంగా మార్చారని ఆగ్రహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహయ చర్యలు చేపట్టాలని… ప్రభావిత ప్రజలకు రూ. 10 వేల సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. వర్షాల కారణంగా బయటకు వెళ్లలేని దినసరి కూలీలను ఆదుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని… దెబ్బతిన్న రోడ్లను యుద్ధప్రాతిపదిన మరమత్తులు చేపట్టాలన్నారు రేవంత్ రెడ్డి.