BREAKING: చిరిగిపోయిన ఆరూరి రమేష్‌ చొక్కా !

-

ఆరూరి రమేష్‌ను తీసుకెళ్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ వాహనాన్ని అడ్డుకున్నారు బీజేపీ నేతలు. దీంతో జనగామ జిల్లా పెంబర్తి దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆరూరి రమేష్‌ను తీసుకెళ్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనాన్ని అడ్డుకున్నారు బీజేపీ నేతలు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాటలో ఆరూరి రమేష్‌ చొక్కా చిరిగిపోయింది.

Ripped Aroori Ramesh shirt

అటు ఆరూరి రమేష్ ను ఇంకా బుజ్జగిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. అందుకే ప్రెస్ మీట్ పెట్టేందుకు సిద్ధమై కూర్చునేముందు ఆరూరిని ఇంట్లోకి తీసుకెళ్లారు బీఆర్ఎస్ నేతలు. హరీష్ రావు ఆదేశాల మేరకే వచ్చామంటున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు. ఇవాళ సాయంత్రం హరీష్ రావు వస్తాడని, పార్టీ మారొద్దని ఆరూరికి చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. దీంతో జై ఆరూరి అంటూ మద్దతుదారులు నినాదాలు చేస్తున్నారు. మరి ఆరూరి రమేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news