ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ముందు రోడ్డు ట్రాన్స్​పోర్ట్ వర్కర్స్ ధర్నా

-

రవాణా రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రోడ్ ట్రాన్స్​పోర్ట్ వర్కర్స్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ముందు ధర్నా చేశారు. తమకు ఆర్థిక సాయం సైతం అందజేయాలని డిమాండ్ చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని, రవాణ రంగ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం కొవిడ్ మహమ్మారిని సాకుగా చూపి పెట్రోల్, డీజిల్, థర్డ్ పార్టీ బీమా, ఫిట్​నెస్ పెంచిందన్నారు.

strike
strike

టోల్ చార్జీలు, రోడ్డు పన్నులు అదనపు భారంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రంగంలో ఆధారపడి ఉన్న 12 లక్షల మంది ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఒక పక్క కుటుంబ పోషణ లేక మరో పక్క ఈఎంఐలు చెల్లించలేకపోతున్నామన్నారు. కార్మిక నేతల ఆందోళనలతో ఐదుగురు నేతలతో మాట్లాడేందుకు రవాణా శాఖ అధికారులు అనుమతించారు. తమ సమస్యలను ఆర్టీఏ కార్యాలయంలోని అధికారులకు కార్మిక నేతలు వివరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news