‘ఆర్ఆర్ఆర్’ కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్… టికెట్ రేట్లు పెంచుతూ జీవో జారీ

-

దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘ ఆర్ఆర్ఆర్’. బాహుబలి తరువాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం… జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు రూ. 336 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించారు. జనవరిలోనే రిలీజ్ కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా సినిమాకు అవాంతరాలు ఏర్పడ్డాయి. తాజాగా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ట్రిపుల్ ఆర్ రిలీజ్ కాబోతోంది. 

ట్రిపుల్ ఆర్ సినిమాకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. సినిమా టికెట్ రేట్లు పెంచుతూ.. తెలంగాణ సర్కార్ జీవో జారీ చేసింది. సాధారణ థియేటర్లలో మొదటి మూడు రోజులకు రూ. 50 , తర్వాత వారం రోజులకు రూ. 30 పెంచుకునే అవకాశం కల్పించింది. మల్టీప్లెక్స్ థియేటర్లు, ఐమాక్స్ లలో మొదటి మూడు రోజు రూ.100, తర్వాత వారం రోజులు రూ.50 పెంచుకునే అవకాశం ఇచ్చింది.  సినిమాకు మార్చి 25వ తేదీనుంచి 10 రోజుల పాటు రోజుకు 5 ఆటలు ప్రదర్శించుకునే వెసులుబాటు కల్పించింది.

మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. ఇటీవల ట్రిపుల్ ఆర్ నిర్మాత, దర్శకలు సినిమా వ్యయం రూ. 336 కోట్లు అయిందని ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని పరిశీలించి ప్రభుత్వ కమిటీ టికెట్ ధరపై రూ. 70 వరకు పెంచుకోవచ్చని జీవో జారీ చేసింది. ఈ ధరలు కూడా మొదటి పదిరోజుల పాటు అమల్లో ఉండనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version