రాజధాని పరిధిలో 15 లక్షల కుటుంబాలకే రూ.500 సిలిండర్‌

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకాలను త్వరలోనే ప్రారంభించడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించేలోగానే ఈ రెండింటిని అమలు చేసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. రాజధాని పరిధిలో పరిధి మూడు జిల్లాలు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 40 లక్షల వంటగ్యాస్‌ కనెక్షన్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 17.20 లక్షల కుటుంబాలకు మాత్రమే ఆహార భద్రతా కార్డులున్నాయని తెలిపారు. గతంలో వీటినే తెల్లకార్డుగా వ్యవహరించేవారు.

తెల్ల కార్డుదారుల్లో 15 లక్షలమందికే వంటగ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. వీరికే రూ.500కు సిలిండర్‌ లభించనున్నట్లు సమాచారం. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు 17.20 లక్షల మందికి దక్కే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరో పది రోజుల్లో కచ్చితమైన లెక్కలువచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఉచిత కరెంటుకు సంబంధించి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను క్షేత్రస్థాయిలో సీజీఎంలు, ఎస్‌ఈలు పరిశీలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version