ఆర్టీసీ సిబ్బందిపై దాడిచేస్తే సహించేది లేదు: సజ్జనార్‌

-

ఆర్టీసీ సిబ్బందిపై దాడిచేస్తే సహించేది లేదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ హెచ్చరించారు. దుండగుల చేతిలో దాడికి గురైన తమ సిబ్బందిని #TSRTC ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు పరామర్శించారు. హైదరాబాద్ తార్నాకలోని టీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని బుధవారం ఆయన పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితితో పాటు దాడి జరిగిన తీరును వారిని అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ కండక్టర్, డ్రైవర్ కు టీఎస్ఆర్టీసీ పూర్తిగా అండగా ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని సజ్జనర్ వారికి భరోసా కల్పించారు. దాడిలో గాయాలైన కండక్టర్ రమేష్ కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.

Sajjanar Visited The Staff Who Were Attacked

ఫరూక్ నగర్ డిపోనకు చెందిన 8ఏ రూట్ బస్సులో విధులు నిర్వర్తిస్తోన్న డ్రైవర్, కండక్టర్ పై ఇద్దరు దుండగులు విచక్షణరహితంగా దాడి చేశారు. తమ తప్పు లేకున్నా బస్సును రోడ్డుపై ఆపి క్రికెట్ బ్యాట్ తో వారిని తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో కండక్టర్ రమేష్, డ్రైవర్ షేక్ అబ్దుల్ కి గాయాలయ్యాయి. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఈ నెల 4న జరిగిందీ సంఘటన. ఈ ప్రమాదంలో తమ సిబ్బంది ఎలాంటి తప్పులేదని, ఉద్దేశపూర్వకంగా సిబ్బందిపై దుండగులు దాడికి పాల్పడ్డారని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయగానే.. హైదరాబాద్ కమిషనరేట్ దోమల్ గూడ పోలీసులు వెంటనే స్పందించారని చెప్పారు. కేసు నమోదు చేసి.. నిందితులు మహ్మద్ మజీద్, మహ్మద్ ఖాసీంలను సోమవారం అరెస్ట్ చేశారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version