TSPSC పేపర్ లీకేజీ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు పేపర్ లీకేజీ ఘటనపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఇంకోవైపు ఈ ఘటనపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆందోళనకు పిలుపునిచ్చారు.
హైదరాబాద్ లక్డీకపూల్ బీఎస్పీ కార్యాలయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు భగ్నం చేశారు. కార్యాలయం గదిలో ప్రవీణ్ కుమార్ దీక్ష కొనసాగిస్తుండగా బలవంతంగా అరెస్టు చేశారు. కార్యాలయం చుట్టూ పోలీసులు మోహరించారు. మీరు ఎన్ని అరెస్టులు చేసినా తన పోరాటం ఆగదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
TSPSC పేపర్ లికేజీ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని… వైస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పేపర్ లికేజీకి నిరసనగా TSPSC కార్యాలయ ముట్టడికి షర్మిల పిలునివ్వడంతో… ఆమె నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగారు.