BRS లోకి R.S. ప్రవీణ్ కుమార్ ?

-

బీఆర్ఎస్ అధినేత  కేసీఆర్ తో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్. నందినగర్ లోని కేసీఆర్ నివాసంలో  మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కి బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానం అందింది. అయితే బీఆర్ఎస్ మద్దతు కోరుతున్నారు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్. 

 

గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురుకుల పాఠశాలలో జరుగుతున్న అక్రమాలపై.. పలు అవినీతి గురించి కేసీఆర్ పై విమర్శలు చేశారు ప్రవీణ్ కుమార్. ఈ నేపథ్యంలోనే తాజాగా నాగర్ కర్నూల్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు తెలిపారు. కేసీఆర్ అభ్యర్థిని పెడతారా..? లేదా అని చర్చించిన తరువాత చెబుతామని వెల్లడించినట్టు సమాచారం. బీఆర్ఎస్ ఇప్పుడు ప్రవీణ్ కుమార్ కి మద్దతు ఇస్తుందా..? లేక ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరతారా అనేది మాత్రం త్వరలోనే క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version