కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రైతులకు రైతుబంధు డబ్బులు జమ చేయకపోగా.. కాంగ్రెస్ రాబందులు తిరిగి రైతులపైనే దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. రైతన్నలారా.. తస్మాత్ జాగ్రత్త! ఈ కాంగ్రెస్ కేడీలపై ఓ కన్నేసి ఉంచండని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
“రైతులకు రైతు బంధు డబ్బులు జమ చేయకపోగా వుల్టా రైతులనే దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ రాబందులు. జోగులాంబ జిల్లా ఐజ మండలంలో ఆర్డీఎస్ కెనాల్ కింద పండిన వరి ధాన్యాన్ని గవర్నమెంట్ ఐకెపి సెంటర్ల ద్వారా కొనుగోలు చేస్తున్నరు. చాలా చోట్ల మహిళా సమాఖ్య అధ్యక్షురాళ్ల అకౌంట్ను తమ గుప్పిట్లో పెట్టుకొని ఇదే అదనుగా ఐకెపి సెంటర్ల దగ్గర కాంగ్రెస్ నాయకులు రైతులను పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారు.
క్వింటాల్ కు నాలుగు కిలోల చొప్పున తక్కువ తూకం వేస్తున్నారు. ఒక ఎకరం 30 క్వింటాలు దిగుబడి వస్తుంది కావున క్వింటాల్ కి నాలుగు కిలోల చొప్పున తీసివేస్తే ఒక ఎకరం మీద రైతు 3500 వందల రూపాయలు నష్టపోతున్నారు. మళ్లీ హమాలి పేరిట క్వింటాల్ చొప్పున 46 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ లెక్క ప్రకారం సగటున ఒక ఎకరానికి ఐకెపి సెంటర్ల ద్వారా గవర్నమెంట్ కి విక్రయిస్తే 4880 రూపాయలు రైతులు నష్టపోతున్నామని ఇక్కడి రైతులు ఆవేదన చెందుతున్నారు.
కెసిఆర్ గవర్నమెంట్ లో ఎకరాకు పెట్టుబడి సహాయంగా 5000 రూపాయలు అందజేస్తే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో వుల్టా ఎకరాకు 4880 రూపాయలు నష్టపోతున్నారు. మొత్తం రైతుల నుండి దోచుకున్న సొమ్ము ఎకరాకు దాదాపు పదివేల రూపాయలన్న మాట! ఇట్ల గుట్టు చప్పుడు కాకుండా తెలంగాణ రైతులను ఇంకా ఎన్ని చోట్ల దోచుకుంటున్నారో ఈ కాంగ్రేసు కేడీలు! ఒక కన్నేసి ఉంచండి. రైతన్నలారా, తస్మాత్ జాగ్రత్త!!” అని ట్వీట్ చేశారు.
రైతులకు రైతు బంధు డబ్బులు జమ చేయకపోగా వుల్టా రైతులనే దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ రాబందులు.
జోగులాంబ జిల్లా ఐజ మండలంలో ఆర్డీఎస్ కెనాల్ కింద పండిన వరి ధాన్యాన్ని గవర్నమెంట్ ఐకెపి సెంటర్ల ద్వారా కొనుగోలు చేస్తున్నరు. చాలా చోట్ల మహిళా సమాఖ్య అధ్యక్షురాళ్ల అకౌంట్ను తమ గుప్పిట్లో…
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) December 31, 2024