జంట న‌గ‌రాల ప్ర‌యాణీకుల‌కు ఆర్టీసీ గుడ్ న్యూస్

-

తెలంగాణ ఆర్టీసీ ఎండీ గా స‌జ్జ‌నార్ వ‌చ్చిన నాటి నుంచి కొన్ని అనుహ్య నిర్ణ‌యాలు తీసుకుంటున్నాడు. ఈ నిర్ణ‌యాల‌తో ఆర్టీసీ ని లాభాల బాట పట్టించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడు. తాజాగా ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ మ‌రొక్క నిర్ణ‌యం తీసుకున్నాడు. జంట న‌గ‌రాలు అయిన హైద‌రాబాద్, సికింద్రాబాద్ ప్ర‌జ‌ల‌కు ఈ నిర్ణ‌యం శుభ‌వార్త అని చెప్ప‌వ‌చ్చు.

టీ – 24 అనే ఒక ఆఫ‌ర్ తీసుకువ‌స్తున్నారు. టీ -24 అంటే ఒక ర‌క‌మైన పాస్ అన్న‌ట్టు. టీ -24 కు రూ. 100 ఉంటుంది. దీని ద్వారా ఒక రోజు ఈ రెండు న‌గ‌రాల‌లో ఆర్టీసీ బ‌స్సుల‌లో తిర‌గ‌వ‌చ్చు. సిటీ ఆర్డ‌న‌రీ, స‌బ‌ర్బ‌న్, మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రో డీల‌క్స్ బ‌స్సుల‌లో ఎన్ని సార్లు అయినా తిర‌గ‌వ‌చ్చు. అయితే పెట్రోల్, డిజిల్ ధ‌ర‌లు విప‌రీతం గా పెర‌గ‌డం తో ప్ర‌జ‌లు ద్విచ‌క్ర వాహానాలు వాడ‌లంటే జంకుతున్నారు. అయితే ఈ టీ -24 ఆఫ‌ర్ ద్వారా సామ‌న్య ప్ర‌జ‌ల‌కు చాలా వ‌ర‌కు ఉప‌శ‌మ‌నం దొరికె అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version