కామంతో కళ్లు మూసుకుపోయి కొంత మంది కన్నుమిన్ను కానడం లేదు. చిన్నారులు, ముసలివాళ్లు అని కూడా చూడకుండా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ సమాజం తలదించుకొనేలా ప్రవర్తిస్తున్నారు. మహిళలపై చేస్తున్న అరాచకాలు సరిపోవన్నట్టు జంతువులపై కూడా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆ యువకుడిని చితక్కొట్టారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు హరియాణ రాష్ట్ర సోనీపత్ జిల్లా లివాస్పూర్ గ్రామంలో నివసిస్తున్నాడు. ఎవరూ లేని సమయం చూసిన ఆ ప్రబుద్ధుడు ఆవుపై అత్యాచారం చేశాడు. తన పని కానిచ్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతడి వికృత చేష్టలు గమనించిన గ్రామస్తులు ఆ యువకుడిని పట్టుకుని చితక్కొట్టారు. విషయం తెలుసుకున్న ఆవు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.