జీవన్ రెడ్డికి మరో వార్నింగ్‌ పంపించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ !

-

జీవన్ రెడ్డికి మరో వార్నింగ్‌ పంపించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరు బస్‌ స్టేషన్‌ సమీపంలో ఉన్న జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ వ్యవహారంలో హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు సజ్జనార్‌. TGSRTC కి పెండింగ్‌లో ఉన్న రూ.2.51 కోట్ల అద్దె బకాయిలను వారం రోజుల్లోగా చెల్లించాలని విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ఆదేశించిందని వివరించారు.

RTC MD Sajjanar sent another warning to Jeevan Reddy

హైకోర్టు ఆర్డర్ జారీ చేసిన రోజు నుంచి వారంలోగా అద్దె బకాయిలు చెల్లించకుంటే నిబంధనల ప్రకారం జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనాన్ని తిరిగి టీజీఎస్‌ఆర్టీసీ స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. భవిష్యత్ లోనూ అద్దె సకాలంలో చెల్లించకుంటే ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా మాల్ ను స్వాధీనం చేసుకోవచ్చని స్పష్టం చేసిందని గుర్తు చేశారు.

విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఆ షాపింగ్‌ మాల్ లోని సబ్‌ లీజ్‌ దారుల ప్రయోజనం దృష్ట్యా మాల్‌ను ఓపెన్‌ చేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని వెల్లడించారు.. హైకోర్టు ఆదేశాల మేరకు సబ్‌ లీజ్‌ దారులను దృష్టిలో ఉంచుకుని జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ ను తెరిచేందుకు శుక్రవారం సంస్థ అనుమతి ఇచ్చింది. వారం రోజుల్లోగా అద్దె బకాయిలు చెల్లించకుంటే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం సంస్థ నడుచుకుంటుందని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news