ఉగాది ప్రయాణికులకు RTC షాక్ !

-

ఉగాది ప్రయాణికులకు RTC షాక్ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. పల్లెవెలుగు బస్సుల్లో ఎక్స్ ప్రెస్ ఛార్జీలు వేస్తున్నారట. దిల్ సుఖ్ నగర్ నుంచి సూర్యాపేట కు 290 రూపాయల ఛార్జ్ వసూళ్లు చేస్తున్నారు. దింతో ఓ ప్రయాణికుడు షాక్ అయ్యాడు. పండగ పూట ఈ నిలువు దోపిడీ ఎంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. సిటీ బస్సులను పెట్టి ఎక్స్ ప్రెస్ టికెట్ రేట్లు కొడుతూ, అంతకంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తోందట ఆర్టీసీ.

RTC reportedly gives shock to Ugadi commuters

దిల్‍సుఖ్‍నగర్ నుండి సూర్యాపేటకు మామూలు రోజుల్లో ఎక్స్ ప్రెస్ టికెట్ రేట్ రూ.200 ఛార్జ్ ఉంటుందట. కానీ పండగ పేరుతో రూ.290 వసూలు చేస్తూ, ఎక్స్ ప్రెస్ బస్సులు కాకుండా సిటీ బస్సులను పెట్టిందట యాజమాన్యం. సిటీ బస్సులు పెట్టి ఎక్స్ ప్రెస్ రేట్లు వసూలు చేయడమేంటని అడుగుతున్న ప్రయాణికులను ఇంతే ఇవ్వకపోతే దిగిపోండి అంటూ దబాయిస్తున్నారట కండక్టర్లు. దింతో మగ ప్రయాణికుల జేబుకు చిల్లు పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news