హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిన్న అర్ధరాత్రి విద్యార్థులు ఒక్కసారిగా నిరసనకు దిగారు. 400 ఎకరాల యూనివర్సిటీ భూమి అమ్మకూడదు అంటూ డిమాండ్ చేస్తూ… రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు విద్యార్థులు. దీంతో హైదరాబాద్ యూనివర్సిటీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ తరుణంలోనే 200 మంది పోలీసులు హైదరాబాద్ యూనివర్సిటీలోకి చొచ్చుకు వచ్చారు. అక్కడి పరిస్థితిని అర్ధరాత్రి కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు హైదరాబాద్ పోలీసులు. దీంతో పోలీసులు అలాగే విద్యార్థుల మధ్య కాస్త తోపులాట కూడా జరిగింది. కాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న 400 ఎకరాల భూమిని అమ్మేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత
యూనివర్సిటీ క్యాంపస్లో మోహరించిన 200 మందికి పైగా పోలీసులు
400 ఎకరాల యూనివర్సిటీ భూమి అమ్మడానికి ఒప్పుకోమంటూ విద్యార్థుల ఆందోళన pic.twitter.com/bxmOVpMw7y
— BIG TV Breaking News (@bigtvtelugu) March 29, 2025