కాంగ్రెస్ పార్టీ రైతులను ఆగం చేస్తున్నది. యాసంగి సీజన్ రైతుబంధు పంపిణీ గందరగోళంగా మారింది. ఇప్పటికే పలువురు రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం నిధులు జమ కాగా, పలువురి ఖాతాల్లో రూ. 1, రూ. 62 చొప్పున జమకావడంతో ఆయా రైతులు విస్తుపోయారు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలానికి చెందిన పాండురంగారెడ్డికి ఐదు ఎకరాల భూమి ఉన్నది.

ఎకరాకు రూ. 5000 చొప్పున రూ. 25,000 జమ కావాల్సి ఉండగా…. ఈసారి ఒక్క రూపాయి మాత్రమే జమైనట్టు ఆయన సెల్ ఫోన్ కు మెసేజ్ వచ్చింది. దీంతో ఆయన కంగుతిన్నారు. ఇదే మండలంలోని టంకర గ్రామానికి చెందిన మరో రైతు ఆంజనేయులుకు రూ. 62 జమైనట్టు మెసేజ్ వచ్చింది. ఆంజనేయులకి గ్రామంలో రెండు గుంటల భూమి ఉండగా…గతంలో రూ. 250 పడేది. ఈసారి రూ. 62 మాత్రమే పడింది.